*పండు తింటే అరిగిపోతుంది*.
*తినకపోతే ఎండిపోతుంది*.
*జీవితం కూడా అంతే*...
*నువ్వు ఖుషీగా గడిపినా*, *భయపడుతూ గడిపినా కాలం కరిగిపోతుంది.*
*గడిచిన కాలం చాలా బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి*...
*రాబోయే కాలం అందంగా ఉంటుంది నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి*....
*ప్రస్తుతం కష్టంగా ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి*...
*మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చెయ్యక్కర్లేదు*...
*ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు**
*అసూయపడే వారితో మన అభివృద్ధి గురించి చెప్పుకోవడం*,
*ఆవేశపడే వారితో మన ఆలోచనల్ని పంచుకోవడం మూర్ఖత్వం.*"
*అనంతమైన దు:ఖాన్ని*
*ఒక్క చిన్న చిరు నవ్వు చెరిపివేస్తుంది.*
*భయంకరమైన మౌనాన్ని*
*ఒక్కమాట తుడిచి వేస్తుంది.*
*అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా చిన్న చిరునవ్వుతో దూరం చేసుకుందాం*
*కష్టాల్లో ఉన్నవారిని ఒక్క పలక రింపుతో సంతోష పెడుదాం*
*పదిమందిలో ఉన్నప్పుడు*
*పట్టింపులు మరిచిపోవాలి*
*నలుగురిలో ఉన్నప్పుడు*
*నవ్వటం నేర్చుకోవాలి*
*అయినవాళ్ళందరితో* *ఆనందాన్ని పంచుకోవాలి*
*కష్టాల్లో ఉన్నప్పుడు*
*కన్నీళ్ళు ఓర్చుకోవాలి*
*చేసేది తప్పని తెలిస్తే* *అలవాటు మార్చుకోవాలి*
*గతం చేసిన గాయాలు* *మర్చిపోవాలి*
*ముందున్న గమ్యాన్ని చేరుకోవాలి*
*మనిషి జీవితం అంటేనే*
*ఒక యుద్ధం అని తెలుసుకోవాలి*..!!
*ఓం శ్రీ సాయిరాం🙏